Supreme court: స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by B.Srinivas |

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నిర్దేశించిన షెడ్యూల్‌ను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme court: స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో (Maharashtra)లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు నిర్దేశించిన షెడ్యూల్‌ను పాటించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు 2026 జనవరి 31 నాటికి మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. లాజిస్టిక్స్ సంబంధించి ఏ సమస్యలున్నా ఈ టైంలోపే తెలియజేయాలని సూచించింది. డీలిమిటేషన్ సాకుతో ఎన్నికలకు వాయిదా వేయడం సరికాదని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం గతంలో నిర్దేశించిన షెడ్యూల్‌ పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఇకపై గడువు పొడిగించబోమని తేల్చి చెప్పింది.

Next Story