- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: ప్రభుత్వంతోనే సమస్య.. ఉరి శిక్షలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మరణశిక్షలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మరణశిక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని వాటిని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడమే సమస్య అని పేర్కొంది. మరణశిక్ష (Death penalty) పడిన దోషులకు ఉరిశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని లేదా వీటిలో దోషులు ఎదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ ను (PIL) ఇవాళ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సైన్యంలో ఈ విధమైన ఎంపిక ఖైదీలకు ఇస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది బుుషి మల్హోత్రా వాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో ఇలాంటి ఎంపికను ఇవ్వడం, అమలు చేయడం సాధ్యం కాదు అని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధర్మాసనం మౌఖిక వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వం కాలానుగుణ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఉరితీయడం అనేది చాలా పాత పద్ధతి. కాలంతో మార్పులు రావాలని పేర్కొంటూ తదుపరి విచారణ నవంబర్ 11 కు వాయిదా వేసింది.






