Supreme court: ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by B.Srinivas |   (  Updated:2025-04-09 14:48:02  IST  )

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Supreme court: ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు (Supreme court) లో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ జేబీ పార్థీవాలా (Jb partheevala), జస్టిస్ ఆర్ మహాదేవన్‌ (Mahadevan)లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటెమ్స్ పై వార్నింగ్ లేబుల్స్ ఉండేలా చూడాలని తెలిపింది. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2020 సవరణలు అమలు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. దీనికి గాను మూడు నెలల గడువు విధించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆహార ప్యాకెట్లపై సమాచారం లేకపోవడం సరికాదని జేబీ పార్థీవాలా ఫైర్ అయ్యారు. కుర్ కురే (Kur Kure), మ్యాగీ వంటి ప్యాకెట్లపై ఎలాంటి డీటెయిల్స్ ఉండటం లేదని తెలిపారు.

దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పష్టమైన ఫుడ్ లేబులింగ్ ఆవశ్యకతపై అఫిడవిట్ దాఖలు చేసిందని కోర్టుకు తెలిపింది. ప్రతిపాదిత నియమాలపై అధికారులకు 14,000 సూచలను వచ్చాయని, దానికి అనుగుణంగా నిబంధనలను సవరిస్తామని పేర్కొంది. కేంద్రానికి మూడు నెలల గడువు విధించిన తర్వాత కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. కాగా, ప్యాకేజీ ముందు భాగంలో వార్నింగ్ లేబుల్‌ను తప్పనిసరి చేయాలని, ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది.

Next Story