ప్రధాని మోడీని కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కలిశారు.

ప్రధాని మోడీని కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కలిశారు. నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజినీకాంత్‌కు మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలతోఉండి.. ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. కాగా, రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ (Coolie Movie) సినిమా రికార్డు నెలకొల్పింది. విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ్‌ మూవీగా నిలిచింది. బాక్సాఫీసు ముందుకు గురువారం వచ్చిన ఈ సినిమా రూ.151 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వివరాలు వెల్లడించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్‌ ఖాన్‌ తదితరులు నటించారు.

Next Story