- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sunita Williams : అంతరిక్షం నుంచి సునితా విలియమ్స్ స్పేస్ పాఠాలు
భారత సంతతి చెందిన వ్యోమగామి(Astronaut) సునీతా విలియమ్స్(Sunita Williams) విద్యార్థుల(Students)కు అంతరిక్షం నుంచే(From Space)వారికి అంతరిక్ష వాతావరణంపై పాఠాలు(Space Lessons) బోధించారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం వంటి అంశాలపై వారితో ముచ్చటించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత సంతతి చెందిన వ్యోమగామి(Astronaut) సునీతా విలియమ్స్(Sunita Williams) విద్యార్థుల(Students)కు అంతరిక్షం నుంచే(From Space)వారికి అంతరిక్ష వాతావరణంపై పాఠాలు(Space Lessons) బోధించారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం వంటి అంశాలపై వారితో ముచ్చటించారు. తాను జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడంతో నడక మరిచిపోయానని..ఇప్పుడు తాను మళ్లీ బాల్యంలో మాదిరిగా నడక నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
స్పేస్ నుంచి విద్యార్థులతో మాట్లాడిన విలియమ్స్ ఇంతకాలంగా అంతరిక్షంలో ఉంటున్న తాను నడవలేదని.. కూర్చోలేదని..కనీసం పడుకొని విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేకపోయిందన్నారు. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలగా తేలియాడుతున్నానని.. దీనివల్ల నేలపై నడిచిన అనుభూతిని కూడా గుర్తుతెచ్చుకోలేకపోతున్నానన్నారు. మా మిషన్ ప్రకారం చూసుకుంటే నెలరోజుల్లోపే అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగిరావాలని..అనివార్య పరిస్థితులతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని..ఇంతకాలం ఇక్కడే ఉండంటం ఆశ్చర్యం కలిగిస్తోందని సునితా విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత సంతతి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ 2024 జూన్ 6న.. 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విలోమోర్ లు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన విషయం విదితమే. జూన్ 14న వీళ్లు భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే వారు వెళ్లి రావాల్సిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడు నెలలుగా వారు స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఆమె తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారానేదానిపై ఇప్పటికి స్పష్టత రావడం లేదు.
అయితే వాళ్లిద్దరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తాజాగా ఎలాన్ మస్క్ కూడా విమర్శలు చేశారు. వాళ్లు ఆలస్యం చేసిన కొద్ధి ఆస్ట్రోనాట్స్ ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. వ్యోమగాములను భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలని స్పేస్‌ఎక్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వాళ్లను తీసుకొచ్చేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష వర్గాల కథనం.






