- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను వదిలేయమని ప్రియురాలి టార్చర్.. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య..
బీహార్ గయాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను వదిలేయమని తోటి లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్ టార్చర్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు సబ్ ఇన్‌స్పెక్టర్ అనుజ్ కశ్యప్. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఎస్‌పీ ఆఫీసులో మీడియా సెల్ ఇంచార్జిగా పని చేస్తున్న అనుజ్.. 2022లో

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ గయాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను వదిలేయమని తోటి లేడీ సబ్ ఇన్‌స్పెక్టర్ టార్చర్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు సబ్ ఇన్‌స్పెక్టర్ అనుజ్ కశ్యప్. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఎస్‌పీ ఆఫీసులో మీడియా సెల్ ఇంచార్జిగా పని చేస్తున్న అనుజ్.. 2022లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య ఐదు నెలల గర్భవతి. ఇదిలా ఉంటే తోటి ఉద్యోగి స్వీటీ కుమారి.. భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన అనుజ్.. ఆరు నెలలుగా ఈ బాధలు భరించలేక.. ఆత్మహత్యను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.
కాగా కశ్యప్, స్వీటీ గయాలోని ఇమామ్ గంజ్ పీఎస్‌లో 2021లో ఫస్ట్ పోస్టింగ్ సమయంలో కలుసుకున్నారు. పనిలో మాత్రమే కాదు బయట కూడా కలవడం, సినిమాలు షికార్లకు వెళ్లడంతో.. వీరి మధ్య బంధం బలపడింది. ఆ తర్వాత వేర్వేరు స్టేషన్లలో పోస్టింగ్ వచ్చినా.. మాట్లాడుకునేవారని తెలుస్తోంది. అయితే 2022లో కశ్యప్‌కు పెళ్లి అయింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తుందని.. ఈ ఘటన జరిగే ముందు కూడా ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుకున్నారని సమాచారం. తీవ్ర వాగ్వాదం జరగడంతోనే అతను సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఉదయం స్వీటీ వచ్చి తలుపు కొట్టినా తీయకపోవడంతో సీనియర్స్‌కు సమాచారం ఇవ్వగా.. డోర్ బద్దలు కొట్టి చూస్తే కశ్యప్ ఉరి వేసుకుని ఉన్నాడు. ప్రస్తుతం స్వీటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన సబ్ ఇన్‌స్పెక్టర్ తండ్రి స్వీటీ బ్లాక్ మెయిల్ కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తున్నాడు.






