Viral video: ‘సామాజిక న్యాయం’ ఎక్కడ? ఆధార్ కార్డు లేదని ఎస్టీ విద్యార్థి బహిష్కరణ! వీడియో వైరల్

by Ramesh Naini |

తమళనాడులో 7వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్ధిని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి బహిష్కరించారు.

Viral video: ‘సామాజిక న్యాయం’ ఎక్కడ? ఆధార్ కార్డు లేదని ఎస్టీ విద్యార్థి బహిష్కరణ! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Tamil Nadu) తమళనాడులో 7వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్ధిని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి బహిష్కరించారని ఆరోపణలతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (Aadhaar, birth certificate) ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఆ విద్యార్ధిని పూవిరుంధవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం నిరాకరించారని కలకలం సృష్టించింది. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని విద్యార్ధి తల్లిదండ్రులు పిల్లాడితో కలిసి (Thiruvallur) తాాజాగా తిరువల్లూరు కలెక్టర్ కార్యాలయం బయట కూర్చుని కలెక్టర్ కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయంలో స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్ధి తన బుక్స్ తెచ్చుకోని చదువుకుంటూ కనిపించడంతో అక్కడ ఉన్న అందరి మనసు చలించి పోయింది. విద్యార్ధికి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ప్రభుత్వం వెంటనే వారికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇందుకు సబంధించిన వీడియో తాజాగా నెట్టింట (Viral video) వైరల్‌గా మారింది. తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలై (Annamalai) మంగళవారం ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర విద్యా విధానం ప్రవేశపెట్టారని అందులో ఇది ఒక భాగమా? అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin)ను ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నరికురవర్ అనే కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చి వారికి సాధికారత కల్పించారని కొనియడారు. కానీ డీఎంకే (DMK) ప్రభుత్వం ఆ కమ్యూనిటీకి చెందిన ఒక బాలుడిని ప్రభుత్వ పాఠశాల నుంచి ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో బహిష్కరించిందని ఆరోపించారు. ఈ సర్టిఫికెట్లు పొందడం కోసం విద్యార్ధి తల్లిదండ్రులు తిరువల్లూరు జిల్లాలో తహశీల్దార్ ఆఫీస్, కనిపించిన ప్రతి ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తట్టినా వారికి దొరకలేదన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ‘సామాజిక న్యాయం’ కేవలం ప్రసంగాల్లో మాత్రమే ఉంటుందని, ఆచరణలో ఉండదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story