- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flying high: సౌదీలో ప్రధానికి అరుదైన గౌరవం.. మోడీ విమానానికి F-15 యుద్ధ విమానాలతో ఎస్కార్ట్
ప్రధాని నరేంద్ర మోడీకి విమానంలో ఉండగానే గగన తలంలో అరుదైన గౌరవం లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి విమానంలో ఉండగానే గగన తలంలో అరుదైన గౌరవం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సౌదీ అరేబియా (Saudi Arabia) పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు సౌదీ అరేబియా (F-15 fighter jets) యుద్ధ విమానాలతో ప్రత్యేక స్వాగతం లభించింది. మోడీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే.. రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 విమానాలు దానిని అనుసరించి, సగౌరవంగా స్వాగతించాయి. ప్రధాని మోడీ విమానానికి ఎఫ్-15 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా విదేశాంగశాఖ షేర్ చేసింది.
సౌదీ అరేబియా, భారత్ మధ్య స్నేహం ఉప్పొంగుతోందని పేర్కొంది. ప్రధాని రాష్ట్ర పర్యటనకు ప్రత్యేక సందర్శనగా, ఆయన విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు రాయల్ సౌదీ వైమానిక దళం ఎస్కార్ట్ చేసిందని వీడియో షేర్ చేసింది. కాగా, ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు ఆరు అవగాహన ఒప్పందాలపై (MoU) సంతకం చేయనున్నారు. అందులో ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారం లభించనుంది. ఇటీవల ప్రధాని మోడీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ల మధ్య ఒప్పందాలపై చర్చలపై జరిగిన విషయం తెలిసిందే. ఇక, జెడ్డాలో భారతీయ ప్రవాసులు మోడీని స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు.






