దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. గంగా పుష్కరాలకు స్పెషల్ ట్రైన్స్

by Disha Web Desk 19 |
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. గంగా పుష్కరాలకు స్పెషల్ ట్రైన్స్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గంగా పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సంస్థ సికింద్రాబాద్, బనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఏప్రిల్ 29 నుంచి మే 5 మధ్యలో సేవలందిస్తాయి. ఏప్రిల్ 29న సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.40 గంటలకు బయలుదేరి, మే 1 ఉదయం 06.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఉదయం 08.35 గంటలకు బనారస్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

మే 2న సికింద్రాబాద్ నుంచి రెండో రైలు రాత్రి 9.40 గంటలకు బయలుదేరుతుంది. అలా మే 5 వరకు ఇవి నిరంతరం ప్రయాణిస్తునే ఉంటాయి. ఈ రైళ్లు జనగాం, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పుర్‌ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటాలియన్, పిపారియా, జబల్‌పూర్, కట్ని జంక్షన్, శాంతా, మణిపూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ స్టేషన్లలో ఆగుతాయి.


Next Story

Most Viewed