- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
26/11 తరహాలో కుట్ర.. 200కు పైగా ఐఈడీలతో ప్లాన్!.. దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఊహలకు అందని ప్రణాళికలతో ఉగ్రమూకలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని (Delhi) ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.హర్యానాలోని ఫరీదాబాద్‍లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరికిన క్రమంలో ఢిల్లీలో డాక్టర్ ఉమర్ నబీ నడుపుతున్న ఐ20 కారులో డిటోనేటర్లు పేలడం వెనుక కుట్ర కోణాన్ని దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు హడావుడిగా జరిగినట్లు అనుమానిస్తుండగా తాజాగా అంతకు మించి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 26/11 ముంబయి ఎటాక్ తరహాలో (Mumbai attacks) మరోసారి విరుచుకుపడేలా దేశ రాజధానిలోని పలు ప్రదేశాలను టార్గెట్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయంతో సహా దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ప్రధాన ప్రదేశాలు లక్ష్యంగా ఉన్నాయని తేలింది. రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లలో పేలుళ్లు చేపట్టాలని ప్రణాళిక వేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో దాడి చేసేందుకు జనవరి నుంచి ఈ కుట్ర జరుగుతోందని పాకిస్తాన్ కు చెందన జైషే మహ్మద్ తో సంబంధాలు ఉన్న ఉగ్రవాద మూక నెలల తరబడి ఈ దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆ వర్గాలు తెలిపారు. ఢిల్లీలోనే కాకుండా గురుగ్రామ్, ఫిరీదాబాద్ లలో కూడా హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ బృందం 200 శక్తివంతమైన ఐఈడీలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాయి.
26/11 ముంబయిలో ఏం జరిగింది?:
2008 నవంబర్ 26న పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయిలో జరిపిన మారణ హోమం భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేరు. పాక్ నుంచి సముద్రమార్గంలో అక్రమంగా ముంబయికి వచ్చిన 10 మంది ఉగ్రవాదులు బృందాలుగా విడిపోయి ముంబయి నగరంలో రక్తపుటేరులు పారించారు. చత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ లో రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ లైట్ హౌస్ ప్రాంతాల్లో ప్రజలపై బాంబులు, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ ను 2012లో ఎరవాడ జైలులో ఉరి తీశారు. ఇక ఈ దాడికి స్కెచ్ వేసి అమెరికాలో నక్కిన కీలక సూత్రధారి తహవూర్ రాణాను ఈ ఏడాది భారత ప్రభుత్వం అమెరికా నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది. ప్రస్తుతం తహవూర్ రాణాను తీహర్ జైల్లో ఉంచారు.






