- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతితో మోదీ, అమిత్ షా వరుస భేటీకి కారణమిదేనా?
ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వీరిద్దరూ వేర్వేరుగా భేటీ కావడం వెనుక కారణం ఏమై ఉంటుందోనని సర్వత్రా చర్చ జరిగింది. ఈ క్రమంలో కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్ముకశ్మీర్ (Jammu&Kashmir)కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంపైనే వీరిద్దరూ రాష్ట్రపతితో చర్చించారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఎన్డీయే సర్కార్ ఆర్టికల్ 370ని (Article 370) రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతున్న క్రమంలో.. వరుస భేటీలు జరగ్గా ఈ చర్చ మొదలైంది. హోంమంత్రి రాష్ట్రపతితో భేటీ అనంతరం జమ్మూకశ్మీర్ నేతలను కలవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేయగా.. ఈ తేదీకి రెండ్రోజుల ముందే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం కూడా ఈ అంశంపై చర్చకు దారితీశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు బిహార ఓటర్ల లిస్ట్ పై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుపడుతున్న తరుణంలోనూ ప్రధాని, హోంమంత్రి రాష్ట్రపతిని కలవడం చర్చనీయాంశమైంది.






