- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‍లోనూ పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!.. ఆదర్శంగా నిలవబోతున్న అతి చిన్న రాష్ట్రం?
పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేందుకు భారత్‍లో మరో రాష్ట్రం యోచిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విచ్చలవిడిగా పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల వినియోగం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటం వారి ఆరోగ్యం, ప్రవర్తనలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు సోషల్ మీడియా వినియోగించే విషయంలో ఆంక్షలు (Social Media Ban) విధించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలోని పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధించగా అదే బాటలో పయనించేందుకు పలు దేశాలు అధ్యయనాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మోడల్ ను అనుసరించేందుకు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన గోవా (Goa) సిద్ధమైనట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు చిన్నారులు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఆస్ట్రేలియా తీసుకొచ్చిన చట్టాన్ని అధ్యయనం చేస్తున్నామన్న తాజాగా గోవా ఇన్ఫోటెక్ మంత్రి రోహన్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. దీంతో గోవా సైతం త్వరలోనే ఇలాంటి చట్టాన్ని తీసుకురాబోతోందనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఏపీలోను బ్యాన్?:
ఏపీలో కూడా పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. దీనిపై తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించేలా.. ఆరోగ్యం, భద్రత కోసం ఆస్ట్రేలియా అమలు చేస్తోన్న అండర్ - 16 చట్టంపై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఏపీలోనూ సామాజిక మాధ్యమాలను చిన్నారులు యాక్సెస్ చేయకుండా ఆంక్షలు అమలు అయ్యే అవకాశం ఉంది. మరి జరుగుతున్న ఈ ప్రచారం ఏ మేరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి.






