- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీల్ చేసేందుకు పాముతో ఆడిన రైతు.. మొహం మీద కాటేయడంతో మృతి
ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్ జిల్లా నకడ్ పీఎస్ పరిధిలోని మొహమ్మద్ పూర్ గుజ్జర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పామును పట్టుకున్న రైతు రాజ్ కుమార్ ఇంటికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా వినలేదు. ఇరుగు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్ జిల్లా నకడ్ పీఎస్ పరిధిలోని మొహమ్మద్ పూర్ గుజ్జర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పామును పట్టుకున్న రైతు రాజ్ కుమార్ ఇంటికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా వినలేదు. ఇరుగు పొరుగు ముందు గొప్పగా చూపించుకునేందుకు ప్రయత్నించాడు. తనకు చిన్నప్పటి నుంచి పాములు పట్టడంలో అనుభవం ఎక్కువగా ఉందని.. గుంపుగా వచ్చిన పిల్లలు, యువకుల ముందు పాముతో ఆటలు ఆడాడు. సోషల్ మీడియాలో రీల్ పెట్టేందుకు వీడియో తీయించాడు.
అయితే ఈ క్రమంలో మొహానికి దగ్గర పెట్టుకుని ఆడటంతో.. ఒక్క క్షణంలో సీన్ మారిపోయింది. విషపూరితమైన పాము అతని ముఖంపై కాటేసింది. ఆ తర్వాత చేతులు, ఇతర శరీర అవయవాలపై కూడా కాటేసింది. దీంతో రామ్ కుమార్ కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చెట్ల మందు తాగించేందుకు తీసుకెళ్లారు. కానీ ఆ మందు పని చేయకపోవడంతో గంగోహ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణంచినట్లు నిర్ధారించారు వైద్యులు.






