అగ్ర దేశంలో టెర్రర్ అటాక్‌కు స్కెచ్.. కారు నిండా గన్స్‌తో పాక్ సంతతి వ్యక్తి

by Kema Shiva Kumar |

భారతదేశ రాజధాని ఢిల్లీలో టెర్రర్ అటాక్ మాదిరిగానే అగ్రరాజ్యం అమెరికాలో అతి పెద్ద ఉగ్ర కుట్ర బయటపడింది.

అగ్ర దేశంలో టెర్రర్ అటాక్‌కు స్కెచ్.. కారు నిండా గన్స్‌తో పాక్ సంతతి వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ రాజధాని ఢిల్లీలో టెర్రర్ అటాక్ మాదిరిగానే అగ్రరాజ్యం అమెరికాలో అతి పెద్ద ఉగ్ర కుట్ర బయటపడింది. డెలావేర్ యూనివర్సిటీలో చదువుతున్న పాకిస్తాన్‌కు చెందిన లుఖ్మాన్ ఖాన్ (25) అనే వ్యక్తి కాల్పులకు పక్కా స్కెచ్ చేశాడు. అతని కారులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, ప్లాన్‌ అమలు చేసేందుకు సిద్ధం చేసుకున్న నోట్‌బుక్ స్వాధీనం చేసుకున్నట్లుగా యూఎస్ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది.

కాగా, యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్ విద్యార్థి అయిన లుఖ్మాన్ ఖాన్ నవంబర్ 24న తన కారులో అనుమానాస్పదంగా కూర్చుని ఉండడాన్ని అక్కడి స్థానిక పోలీసులు గుర్తించారు. దీంతో అతని దగ్గరకు వెళ్లి విచారించి అతడి కారును చెక్ చేయగా కళ్లు బైర్లు కమ్మాయి. డిక్కీలో 357 క్యాలిబర్ హ్యాండ్‌గన్, 27 రౌండ్లతో లోడ్ చేసిన మూడు అదనపు మ్యాగజైన్లు, 9ఎంఎం గ్లాక్ మ్యాగజైన్, ఒక బాలిస్టిక్ ప్లేట్, ఒక చేతితో రాసిన నోట్‌బుక్ లభించాయి. హ్యాండ్‌గన్‌కు మైక్రో ప్లాస్టిక్ కన్వర్షన్ కిట్ అమర్చబడి ఉండటంతో అది సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌లా పని చేస్తుందని పోలీసులు గుర్తించి లుఖ్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. స్పాట్‌లో దొరికిన ఓ నోట్‌బుక్‌లో సంచలన విషయాలు తెలిశాయి. నిందితుడు లుఖ్మాన్ ఖాన్ అటాక్ ఎలా చేయాలో అందులో క్లియర్‌గా రాశాడు. దాడికి ఉపయోగించే ఆయుధాలు, దాడి తర్వాత ఎలా తప్పించుకోవాలి లాంటి విషయాలను అందులో నోట్ చేసుకున్నాడు.

Next Story