ఆరు రాష్ట్రాల్లో SIR గడువు పెంపు

by Muthe.Rajitha |

ఆరు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను పొడిగిస్తూ భారత ఎన్నికల కమిషన్ (ECI) ఉత్తర్వులు ఇచ్చింది.

ఆరు రాష్ట్రాల్లో SIR గడువు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆరు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను పొడిగిస్తూ భారత ఎన్నికల కమిషన్ (ECI) ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, చత్తీస్‌గఢ్, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు కేరళలో కూడా SIR ఎన్యుమరేషన్ డెడ్‌లైన్‌ను ఒక వారం పెంచింది. మొత్తం 12 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలలో (అండమాన్ & నికోబార్, చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్) SIR ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం SIR ప్రక్రియ నేటితో ముగియనుండగా.. డిసెంబర్ 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.

Next Story