- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాసంస్థల్లో వందేమాతరం గీతాలాపన తప్పనిసరి.. యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం గీతాలపన తప్పనిసరి చేస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం మోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం గీతాలపన తప్పనిసరి చేస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం మోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జనతా దర్శనం నిర్వహించిన అనంతరం యోగి సభలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... వందేమాతరాన్ని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. దానిని వ్యతిరేకించడమే భారతదేశ విభజనకు కారణం అవుతుందని వ్యాఖ్యానించారు.
వందేమాతరం పాడటం వల్ల మాతృభూమి పట్ల పౌరుల్లో భక్తి, ప్రేమ పెరుగుతాయన్నారు. వందేమాతరం గీతం పట్ల గౌరవ భావం ఉండాలని తెలిపారు. కులం, మతం, భాష పేరుతో విభజించే అంశాలను గుర్తించడం ముఖ్యం అని చెప్పారు. విభజన ఉద్దేశం రాకముందే ఆ ఆలోచనలను పూడ్చిపెట్టాలన్నారు. ఇదిలా ఉంటే 1937లో వందేమాతరంలోని ముఖ్యమైన శ్లోకాలను తొలగించారని, ఇది దేశ విభజనకు బీజాలు వేసిందని శుక్రవారం ప్రధాని మోడీ ఆరోపించారు. మోడీ చేసిన వ్యాఖ్యల తరవాత యూపీ విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి చేయడం ఆసక్తికరంగా మారింది.






