Shubhanshu: రేపే ఐఎస్ఎస్‌లోకి శుభాంశు శుక్లా

by B.Srinivas |

భారత వ్యోమగామి సుభాంశు శుక్లా యాక్సియమ్-4 మిషన్ లో భాగంగా బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు.

Shubhanshu: రేపే ఐఎస్ఎస్‌లోకి శుభాంశు శుక్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వ్యోమగామి సుభాంశు శుక్లా (Shubhanshu Shukla) యాక్సియమ్-4 మిషన్ లో భాగంగా బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 05:30 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. శుక్లాతో పాటు మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ సైతం వెళ్లనున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ (Cennadi space center) నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్‌కు శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ పరిశోధనలు చేయనున్నారు. సుమారు 14 రోజుల పాటు ఐఎస్ఎస్‌లోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రయోగం నేపథ్యంలో భారత వైమాణిక దళం శుక్లాకు శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, ఈ మిషన్‌ను మే 29న ప్రారంభించాల్సి ఉండగా జూన్ 8కి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 10కి పోస్ట్ పోన్ చేసి 11న ఫిక్స్ చేశారు.

Next Story