- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికాలో కాల్పులు.. 10 మంది మృతులు
by Muthe.Rajitha |
దక్షిణాఫ్రికాలో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

X
దిశ, వెబ్ డెస్క్ : దక్షిణాఫ్రికాలో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జొహన్నెస్‌బర్గ్ శివారులోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో ఓ సాయుధుడు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కాల్పులకు గల కారణం ఇప్పటికీ తెలియరాలేదని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story






