షాకింగ్ వీడియో.. స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో బయటపడ్డ కత్తులు, కండోమ్స్

by Yella Dhawani Reddy |

సాధారణంగా స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో బుక్స్, పెన్స్, పెన్సిళ్లు వంటివి ఉంటాయి.

షాకింగ్ వీడియో.. స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో బయటపడ్డ కత్తులు, కండోమ్స్
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా స్కూల్ విద్యార్థుల (School students) బ్యాగుల్లో బుక్స్, పెన్స్, పెన్సిళ్లు వంటివి ఉంటాయి. అంతేకానీ, కత్తులు, కండోమ్స్, ప్లేయింగ్ కార్డ్స్ వంటివి ఉంటాయని అసలు ఎవరు ఊహించరు కదా. కానీ, తాజాగా ఇలాంటి ఓ ఘటనే మహారాష్ట్రలో (Maharasta) వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటనకు పాఠశాల యజమాన్యం సైతం ఒక్కసారిగా విస్తుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

నాసిక్‌లోని (Nasik) ఘోటిలో ఓ పాఠశాలలో ఇటీవల ఉపాధ్యాయులు 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల బ్యాగుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో వారి బ్యాగుల్లో చేతులకు పెట్టుకునే కడియాలతో పాటు కత్తులు, కండోమ్స్ ప్యాకెట్లు దొరికాయి. ఇవి చూసిన ఉపాధ్యాయులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెప్పగా.. ఆయన కూడా వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే, పిల్లల గోప్యత దృష్ట్యా ఇవి ఎవరి బ్యాగుల్లో దొరికాయో చెప్పడం లేదు. ఇక ఎవరి వద్ద లభ్యమయ్యాయో వారి తల్లిదండ్రులకు దీనిపై సమాచారం ఇచ్చారు. అసలు విద్యార్థుల వద్ద ఇలాంటివి ఎందుకు ఉన్నాయి, ఏవైనా నేరాలకు పాల్పడుతున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, విద్యార్థుల మానసిక ప్రవృతి తెలుసుకునేందుకు ఈ మధ్యకాలంలో తరచుగా ఇలాంటి తనిఖీలు చేస్తున్నట్లు స్కూల్ యజమాన్యం వెల్లడించింది. అలాగే, తరచుగా సోదాలు చేయడం వల్ల విద్యార్థులు కూడా అలాంటి వస్తువులను వెంట తీసుకురారని తెలిపింది. అంతేకాదు, తాము చేస్తున్న ఈ సోదాలకు తల్లిదండ్రులు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story