- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US peace proposal: క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందన పేర్కొనడం షాకింగ్
శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ స్పందించింది. కాగా.. ఈ విషయంపై కీవ్ స్పందిస్తూ అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని పేర్కొనడం తమను షాక్‌కు గురిచేసిందని పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ స్పందించింది. కాగా.. ఈ విషయంపై కీవ్ స్పందిస్తూ అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని పేర్కొనడం తమను షాక్‌కు గురిచేసిందని పేర్కొంది. క్రిమియాను తామెన్నటికీ రష్యాలో భాగంగా గుర్తించమని..అమెరికా ప్రతిపాదనను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. అమెరికా ప్రతిపాదనకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్ మెరెజ్కో అన్నారు. క్రిమియాను రష్యా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని..దానిని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకోసం, దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి ఉంటుందని.. ప్రజలందరి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. క్రిమియాను వదులుకోవడం అంటే తమ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని అన్నారు. ఇలా చేస్తే జెలెన్ స్కీ భవిష్యత్తులో ఎన్నో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అంతే కాకుండా దీన్ని కీవ్ లో రాజద్రోహంగా పరిగణిస్తారని అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఎప్పటికీ అటువంటి చర్యలు తీసుకోదని అన్నారు. మరోవైపు, ప్రపంచ దేశాలు లేదా ఉక్రెయిన్ ప్రభుత్వం రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తాము ఈ పోరాటాన్ని ఎన్నటికీ ఆపబోమని ఉక్రెయిన్ సైనిక అధికారులు పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారని..వారి త్యాగాలకు ఫలితం కచ్చితంగా తమ దేశ ప్రజలకు దక్కాలని అన్నారు.
క్రిమియా
దక్షిణ ఉక్రెయిన్‌లో బ్లాక్ సీ వెంబడి ఉన్న క్రిమియా (Crimea) ఒక వ్యూహాత్మక ప్రాంతం. 2014లో రష్యా దానిని స్వాధీనం చేసుకుంది. కాగా.. ఇదే అంశంపై ట్రంప్ ఇటీవలే మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine)ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా, క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా (US) గుర్తించిందని..ఇకపై క్రిమియా (Crimea) రష్యాతోనే (Russia) ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్ కు సూచించారు. శనివారం వాటికన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన తర్వాత ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై మండిపడ్డారు. పుతిన్‌కు యుద్ధం ఆపాలన్న ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని ఫైర్ అయ్యారు.






