జోరుమీదున్న NDA‌కు షాక్.. కూటమి నుంచి వైదొలగిన ఏఎంఎంకే

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-04 09:11:56  IST  )

దేశంలో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని జోరుమీదున్న ఎన్డీఏ‌ (NDA)కు బిగ్ షాక్ తగిలింది.

జోరుమీదున్న NDA‌కు షాక్.. కూటమి నుంచి వైదొలగిన ఏఎంఎంకే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని జోరుమీదున్న ఎన్డీఏ‌ (NDA)కు బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు (Tamilnadu)కు చెందిన ప్రాంతీయ పార్టీ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ కూటమి నుంచి వైదొలిగింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ (TTV Dinakaran) తమ పార్టీ ఇకపై తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగం కాదని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఎంఎంకే డిసెంబర్‌లో ఏ కూటమిలో చేరాలనే దానిపై పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Next Story