కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..! బేసిక్ పేలో DA విలీనంపై కీలక ప్రకటన

by Ramesh Naini |

నిమిదో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..! బేసిక్ పేలో DA విలీనంపై కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎనిమిదో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) లేదా డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. సోమవారం పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. డీఏ, డీఆర్‌ను బేసిక్ పేలో విలీనం గురించి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం 8 వ వేతన సంఘం తీర్మానాన్ని నవంబర్ 3న నోటిఫై చేసిందని చెప్పారు. అయితే ప్రస్తుతానికి డీఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని, ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాథమిక వేతనం, పెన్షన్ విలువ తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ, డీఆర్ రేట్లను సవరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, గత నెలలో దీపావళికి ముందు ప్రభుత్వం డీఏ/డీఆర్‌ను 3 శాతం పెంచడంతో 55 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి డిసెంబర్ 31 నాటికి పదేళ్లు పూర్తి అయింది. ఈ ఏడాది జనవరిలోనే కేంద్రం కొత్త పే కమిషన్ ప్రకటించింది.

Next Story