Nails Problemsb : వింత వ్యాధులతో మరోసారి వార్తల్లోకి ఎక్కిన మహారాష్ట్రలోని షెగావ్ తాలూకా

by Muthe.Rajitha |   (  Updated:2025-04-18 12:35:08  IST  )

మహారాష్ట్ర(Maharashtra)లోని షెగావ్(Shegaon) తాలూకాలో కొద్ది నెలల క్రితం ప్రజల జుట్టు ఆకస్మికంగా ఊడిన(Hair Loss) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Nails Problemsb : వింత వ్యాధులతో మరోసారి వార్తల్లోకి ఎక్కిన మహారాష్ట్రలోని షెగావ్ తాలూకా
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని షెగావ్(Shegaon) తాలూకాలో కొద్ది నెలల క్రితం ప్రజల జుట్టు ఆకస్మికంగా ఊడిన(Hair Loss) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ అదే తాలూకాలోని గ్రామాలు ప్రజల గోళ్ళ సంబంధిత(Nail Problems) వింత వ్యాధులతో మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. దాదాపు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్ళు ముడతలు పడుతూ, ఊడిపోతూ షెగావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. కాగా జుట్టు ఊడటానికి కారణం అయిన సెలీనియం(Selenium), ఈ సమస్యలకు కూడా కారణం అయి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. అయితే గతంలో జుట్టు ఊడటంపై రీసెర్చ్ చేసిన పరిశోధకులు.. అక్కడి నేలల్లో అత్యధికంగా ఉన్న సెలీనియం గోధుమ పంట(Wheat Crop) ద్వారా ప్రజల్లోకి చేరడం వలన సమస్య ఏర్పడినట్టు తేల్చారు. కాగా గతంలో జుట్టు ఊడిన సమస్య ఎదుర్కొన్న వారిలోనే ఈ గోళ్ళ సమస్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

Click For Tweet Post..

Next Story