- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sheesh Mahal: ఆప్ అబద్దాలకు శీష్ మహాలే చిహ్నం.. ప్రధాని మోడీ విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్ అబద్దాలకు కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్ మహలే చిహ్నమని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)పై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్ అబద్దాలకు కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్ మహలే (Sheesh mahal) నిదర్శనమని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుందో, ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి శీష్ మహల్ నిర్మాణమే పెద్ద ఉదాహరణ అని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యక్తిగత విలాసాల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆప్ దుర్వినియోగం చేసిందన్నారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంటే.. రోడ్డు నిర్వహణ, పారిశుధ్యం వంటి సేవలను ఆప్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.
ఆప్ అబద్దాల ఆధారంగానే పని చేస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. ఆరోగ్య సంరక్షణ, ఉచిత వైద్యాన్ని అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆప్ అమలు చేయలేదన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే స్థానికులకు అందాల్సిన సౌకర్యాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆప్ నెరవేర్చని వాగ్దానాలను, వారి వైఫల్యాలను ప్రజలకు తెలియ జేయాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. ఇంటింటికీ ప్రచారం చేయడం ద్వారా ఆప్ అసమర్థతను బయటపెట్టాలని కోరారు.






