రాజకీయం చేయొద్దు.. అజిత్ పవార్ మృతిపై స్పందించిన శ‌ర‌ద్ ప‌వార్

by Ajay Maddhiboyina |

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ఎన్సీపీ అధినేత‌ర శ‌ర‌ద్ ప‌వార్ స్పందించారు. ఇది పూర్తిగా ప్ర‌మాదమేన‌ని దీనిని ఎవ‌రూ రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. అజిత్ త‌న‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌ర‌ణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింద‌ని అన్నారు.

రాజకీయం చేయొద్దు.. అజిత్ పవార్ మృతిపై స్పందించిన శ‌ర‌ద్ ప‌వార్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ఎన్సీపీ అధినేత‌ర శ‌ర‌ద్ ప‌వార్ స్పందించారు. ఇది పూర్తిగా ప్ర‌మాదమేన‌ని దీనిని ఎవ‌రూ రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. అజిత్ త‌న‌తో పాటు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌ర‌ణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింద‌ని అన్నారు. ఓ స‌మ‌ర్ధుడైన నాయ‌కుడిని రాష్ట్రం కోల్పోయింద‌ని అన్నారు. జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌లేమ‌ని, కానీ ప్ర‌తిదీ మ‌న చేతుల్లో లేద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇందులోకి రాజ‌కీయాలు తీసుకురావ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇదిలా ఉంటే అంత‌కు ముందు అజిత్ ప‌వార్ మృతిపై ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అజిత్ ప‌వార్ మ‌ర‌ణం వెనుక కుట్ర‌కోణం ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్యాప్తు చేయాల‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే మీడియా ముందుకు వ‌చ్చిన‌ట్టు శ‌ర‌ద్ పవార్ తెలిపారు.

Next Story