- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్వస్థతకు గురై మరోసారి ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, త్రోట్ ఇన్వెక్షన్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చేరినట్టు కూతురు, బారామతి ఎంపీ సుప్రియో సూలే తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, త్రోట్ ఇన్వెక్షన్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చేరినట్టు కూతురు, బారామతి ఎంపీ సుప్రియో సూలే తెలిపారు. ప్రస్తుతం శరద్ పవార్ పూణేలోని రూబి హాల్ క్లినిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. పరిస్థితి విషమించడంతోనే తదుపరి వైద్య పరిశీలన, సంరక్షణ కోసం ఆస్పత్రికి తరలించిందని తెలుస్తోంది. వారం రోజుల క్రితం కూడా శరద్ ఇదే ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, దగ్గు ఎక్కువ అవ్వడంతో ఆస్పత్రిలో చేరగా ఆయనకు చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. చికిత్స అనంతరం గత శనివారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ తరవాత పవార్ రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రజల ముందుకు వస్తారని ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్యం గురించి ప్రార్థించినందుకు శరద్ పవార్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ ఇప్పుడు తిరిగి ఆయన ఆస్పత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






