- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంచలనం.. ఏకంగా మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ
రూ.100 కోట్ల మనీలాండరింగ్, జీఎస్టీ మోసం కేసులో పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాకు కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ (Punjab) పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రూ.100 కోట్ల మనీలాండరింగ్, జీఎస్టీ (GST) మోసం ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇవాళ గుర్గావ్‌లోని ప్రత్యేక కోర్టు ఆదివారం ఆయనకు 7 రోజుల ఈడీ కస్టడీని విధిస్తూ తీర్పునిచ్చింది.
మోసానికి పాల్పడ్డారు ఇలా..
మంత్రి సంజీవ్ అరోరా, ఆయనకు సంబంధించిన ‘హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్’ (Hampton Sky Realty Limited) సంస్థపై ఈడీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. మొబైల్ ఫోన్ల కొనుగోలుకు సంబంధించి దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన తప్పుడు జీఎస్‌టీ ఫేక్ బిల్లులను సృష్టించి, తద్వారా భారీగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులను దుబాయ్‌కి పంపి, తిరిగి పెట్టుబడుల రూపంలో భారత్‌కు రప్పించే (Round-tripping) ప్రక్రియలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ పేర్కొంది. గతంలో లూథియానాలోని పారిశ్రామిక భూముల కేటాయింపులో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. శనివారం సాయంత్రం చండీగఢ్‌లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు, సుదీర్ఘ విచారణ అనంతరం అరోరాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టేందుకు కస్టడీ అవసరమని ఈడీ వాదించింది. 10 రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మాత్రం 7 రోజులకు మాత్రమే పర్మీషన్ ఇచ్చింది.






