దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం.. ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 01:54:04  IST  )

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో సంచలనం చోటుచేసుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం.. ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో సంచలనం చోటుచేసుకుంది. రోహిణి (Rohini) ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్లు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ( Delhi Crime Branch) పోలీసులు బిహర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు బడా గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. మృతుల్లో గ్యాంగ్‌లీడర్ రంజక్ పాఠక్ (Ranjan Patak) (25), బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, బిహార్‌ (Bihar)లో అనేక తీవ్రమైన నేరాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఈ నలుగురు నిందితులు ‘సిగ్మా ఎండ్ కంపెనీ’ పేరుతో ఓ గ్యాంగ్‌ను నడిపుతూ అరాచకాలు సృష్టించారు. అయితే, వారిపై స్వరాష్ట్రంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవ్వడంతో సొంత రాష్ట్రాన్ని వదిలి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story