దిశ పటానీ కాల్పుల కేసులో సెన్సేషన్.. నిందితుల ఎన్‌కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-17 15:06:29  IST  )

హీరోయిన్ దిశ పటానీ (Disha Patani) ఇంటి ఎదుట దుండగులు కాల్పులు జరిపిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దిశ పటానీ కాల్పుల కేసులో సెన్సేషన్.. నిందితుల ఎన్‌కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ దిశ పటానీ (Disha Patani) ఇంటి ఎదుట దుండగులు కాల్పులు జరిపిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే కేసును సీరియస్ తీసుకున్న రాష్ట్ర పోలీసులు నిందితుల ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. తాజాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు ఏకంగా పోలీసులపైకి కాల్పులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులైన అరుణ్, రవీంద్ర తీవ్రమైన బుల్లెట్ గాయాలతో స్పాట్‌లోనే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందారు.

కాగా, ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో సెప్టెంబర్ 12న ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ (Khushboo Patani) వ్యాఖ్యలు చేశారంటూ దుండగులు ఆమె ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఆ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్‌ గ్యాంగ్‌ ఇప్పటికే ప్రకటించింది. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ పటానీ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నారు.

Next Story