IAS Ashok Khemka: 34 ఏళ్లలో 57 సార్లు ట్రాన్స్ ఫర్.. నేడు రిటైర్డ్ కాబోతున్న ఐఏఎస్ అశోక్ ఖేమ్కా

by Prasad Jukanti |

సోనియా గాంధీ అల్లుడితో ఢీ కొట్టి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ రిటైర్ కాబోతున్నారు.

IAS Ashok Khemka: 34 ఏళ్లలో 57 సార్లు ట్రాన్స్ ఫర్.. నేడు రిటైర్డ్ కాబోతున్న ఐఏఎస్ అశోక్ ఖేమ్కా
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిజాయితీ, అవినీతి వ్యతిరేక వైఖరితో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న హర్యానా (haryana) క్యాడర్ కే చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా (Ashok Khemka) ఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. అనేక సవాళ్లు మధ్య తన 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు కాలంలో రికార్డు స్థాయిలో 57 సార్లు బదిలీలకు ఆయన సర్వీస్ ప్రస్థానం నేటితో ముగియనుంది. 1991 క్యాడర్ కు చెందిన ఖేమ్కా ప్రస్తుతం హర్యాణా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఇవాళ రిటైర్ కాబోతున్నారు. ఆయన ఈ పదవిలోకి గతేడాది డిసెంబర్ లో వచ్చారు.

సోనియా గాంధీ అల్లుడితో ఢీ:

2012 లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రాకు (Robert Vadra) సంబంధించి గురుగ్రామ్ లో ఓ భూమి మ్యూటేషన్ ను అశోక్ ఖేమ్కా రద్దు చేశారు. దీంతో ఖేమ్కా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ సంఘటన తర్వాత ఆయన అనేక సార్లు ప్రధాన్యత లేని శాఖలకు బదిలీ అవుతూ వస్తున్నారు. గతేడాది జనవరిలో నాటి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు ఆయన ఓ లేఖ రాసి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్రంలో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు తనకు విజిలెన్స్ విభాగానికి అధిపతిగా అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అవినీతిని అంతం చేయాలనే నా సర్వీస్ కెరీర్ ను త్యాగం చేశాను. నా సర్వీస్ చివరి దశలో అవినీతిని పెకిలించడానికి తనకు ఈ అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.

1965 ఏప్రిల్ 30న కోల్ కతాలో జన్మించిన అశోక్ ఖేమ్కా ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్ డీ పూర్తి చేఎశారు. అనంతరం బిజినెస్, ఫైనాన్స్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఉద్యోగం చేస్తూనే పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేశారు.

Next Story