- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Navy: దేశ రక్షణ తయారీని మెరుగుపరచడానికి సెమీకండక్టర్ పాలసీ ముఖ్యం: నేవీ చీఫ్
ఈ పాలసీ తప్పనిసరిగా దేశ ఆర్థికవ్యవస్థకు కొత్త ఇంధనం అవుతుంది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రక్షణ తయారీని మెరుగుపరిచేందుకు భారత సెమీకండక్టర్ పాలసీ ముఖ్యమని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి అన్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ప్రైవేట్ రంగం ముందుండి దేశాన్ని స్వావలంబనగా మార్చాలన్నారు. ఈ పాలసీ తప్పనిసరిగా దేశ ఆర్థికవ్యవస్థకు కొత్త ఇంధనం అవుతుంది. సెమీకండక్టర్ పాలసీపై టెక్నాలజీతో నడిచే నేవీకి సానుకూల అంచనాలున్నాయి. ఈ కొత్త పాలసీ పౌర, రక్షణ రంగాలకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త పాలసీలు చిన్న ప్రాజెక్టులకు రూ. 1.5 కోట్ల వరకు గ్రాంట్‌లను అందజేస్తుండగా, అదితి పథకం ద్వారా రూ. 25 కోట్ల వరకు నిధులు లభిస్తాయని అడ్మిరల్ చెప్పారు. ఈ సందర్భంగా స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) ఆవిష్కరణలకు తోడ్పడేందుకు ఉద్దేశించిన ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) పథకం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది రూ.450 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో 75 శాతం రక్షణ రంగానికి కేటాయించింది. అందులో దాదాపు 25 శాతం ప్రైవేట్ పరిశ్రమలకు కేటాయించారని వివరించారు. ఈ నేపథ్యంలో నావికాదళం భవిష్యత్తు టెక్నాలజీ అవసరాలను తీర్చేందుకు ప్రైవేట్ పరిశ్రమలు సహకరించాలని పేర్కొన్నారు.






