- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pahalagam Terror Attack : ఫోక్ సింగర్ పై దేశ ద్రోహం కేసు నమోదు
పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో ఓ ఫోక్ సింగర్(Folk Singer) పై దేశద్రోహం కేసు(Sedition Case) నమోదు చేశారు పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో ఓ ఫోక్ సింగర్(Folk Singer) పై దేశద్రోహం కేసు(Sedition Case) నమోదు చేశారు పోలీసులు. ఫోక్ సింగర్ నేహా సింగ్ రాఠోడ్(Neha Singh Rathod)పై లక్నో(Lucknow)లోని ఈ కేసు నమోదైంది. ఆమె తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రజల్లో ముఖ్యంగా ఒక మతానికి చెందిన వారిలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు చేశారని పలు ఫిర్యాదులు అందడంతో.. సోమవారం నేహపై కేసు నమోదు చేశారు. ఉగ్రదాడిలో వారి మతాన్ని అడిగి 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారని, దేశాన్ని దుఃఖంలోకి నెట్టిన దోషులపై పగ తీర్చుకోవాలని ఆమె కోరింది. నేహా సింగ్ రాఠోడ్ తన పోస్టుల ద్వారా దేశ సమగ్రతను దెబ్బతీసేలా, మతాలను, ప్రజలను రెచ్చగొట్టేలా పదేపదే ప్రయత్నించినట్లు ఫిర్యాదుదారుడు అభయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఆమెపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ప్రజా శాంతిని భంగపరచడం, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలోకి నెట్టడం వంటి సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది.






