- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంలో సెబీకి షాక్.. మరో 3 నెలల మాత్రమే టైమ్!
by Satheesh |
అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ రీసెర్చ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెలువడిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు పొడిగించాలని సెబీ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. మరో మూడు నెలల్లో దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆగస్టు రెండో వారం తర్వాత తదుపరి విచారణ జరుపుతామని అప్పటి వరకు నివేదికను సమర్పించాలని తెలిపింది. చేసే పనిలో వేగం ఉండాలని సెబీ నిరవధికంగా సుదీర్ఘ సమయాన్ని తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది.
Next Story






