మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెర్చింగ్​ఆపరేషన్

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు సెర్చింగ్​ఆపరేషన్​చేపట్టారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెర్చింగ్​ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్(Bijapur) జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత(Maoist-Affected Areas) ప్రాంతాల్లో భద్రతా బలగాలు సెర్చింగ్​ఆపరేషన్​చేపట్టారు. ఈ సందర్భంగా భారీ డంపులను గుర్తించారు. ఇందులో పేలుడు పదార్థాలు మరియు ఇతర మావోయిస్టు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ అడవుల్లో మావోయిస్టులు నిర్మించిన స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. జిల్లాలో ఇంకా మావోయిస్టు సంస్థపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బలగాలు మాట్లాడుతూ మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్థానిక పోలీసులకు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలన్నారు. పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రాంతం మ్యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అవసరాన్ని బట్టి ఆపరేషన్స్‌ వ్యూహంలో మెళుకువలతో పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలో సూచించారు.

Next Story