- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ బిచ్చగాళ్లపై సౌదీ, యూఏఈ కొరడా
సౌదీలో భిక్షాటన చేస్తూ.. నేరాలకు పాల్పడుతున్న పాక్ బిచ్చగాళ్లపై ఆ దేశం బహిష్కరణ వేటు వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సౌదీలో భిక్షాటన చేస్తూ.. నేరాలకు పాల్పడుతున్న పాక్ బిచ్చగాళ్లపై ఆ దేశం బహిష్కరణ వేటు వేసింది. కొన్నేళ్లుగా తమ దేశంలో ఉంటూ దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న 56వేల మంది పాక్ బిచ్చగాళ్లను తమ దేశం నుంచి బహిష్కరించినట్లు పాక్ చట్టసభకు అక్కడి జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవలే నివేదిక అందించింది. అక్రమ వలసలు, భిక్షాటన నిర్మూలనలో భాగంగా ఈ ఏడాదిలో యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు 66,154 మంది పాక్ పౌరులను వెనక్కి పంపినట్లుగా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) వెల్లడించింది. ఈ మేరకు తమ దేశ జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి నివేదిక అందించింది. వర్క్, పర్యాటక, ఉమ్రా వీసాలపై వెళ్లినవారే 51 వేల మంది బహిష్కరణకు గురైన వారిలో ఉండటం గమనార్హం.
అయితే.. పాక్ బిచ్చగాళ్ల అక్రమ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదని, ఆఫ్రికా, ఐరోపా దేశాలతో పాటు కాంబోడియా, థాయ్ లాండ్ ల పర్యాటక వీసాలను సైతం దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించామని FIA డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ తెలిపారు. ఈ ఏడాది సౌదీ నుంచి 24 వేల మంది, దుబాయ్ నుంచి 6 వేల మంది, అజర్ బైజా్ నుంచి 2500 మంది బహిష్కరణకు గురవ్వగా.. కాంబోడియాకు వెళ్లిన 24 వేల మందిలో సగం మంది తిరిగి వచ్చారని, మయన్మార్ కు టూరిస్ట్ వీసాపై వెళ్లిన 4 వేల మందిలో 2500 మంది తిరిగి రాలేదని పేర్కొన్నారు. కాగా.. ఆయా దేశాల్లో అరెస్టవుతున్న బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీయులే ఉండటం, జేబు దొంగతనాలకు పాల్పడుతుండటంతో.. ఆ దేశ పౌరులకు UAE వీసాల జారీని నిలిపివేసింది.






