- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్-సౌదీ మధ్య ‘నాటో’ స్టైల్ డీల్.. ఇండియాకు సమస్యేనా?
పాక్-సౌదీ మధ్య ‘నాటో’ స్టైల్ డీల్ కుదిరింది. దీంతో ఇండియాకు సమస్యేనని కొందరు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇక్కడ వేరే కథ ఉందనేది ఇతరుల వాదన.

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీ అరేబియాతో పాకిస్తాన్ కీలక రక్షణ ఒప్పందం చేసుకుంది. ఇకపై ఈ రెంటిలో ఏ దేశంపై దాడి జరిగినా తమపై జరిగినట్లే మరో దేశం స్పందిస్తుందని ఇరుదేశాలు ప్రకటించాయి. ఈ ‘నాటో’ స్టయిల్‌లో ఉన్న ‘స్ట్రాటజిక్ మ్యూచ్యువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. దోహాలో ఇటీవలే 40 ఇస్లామిక్ దేశాలు కలిసిన సమయంలో తమకు కూడా నాటో వంటి వ్యవస్థ అవసరమనే ప్రతిపాదన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం రియాద్ వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సౌదీతో తాజా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ‘రెండింట్లో ఏ దేశంపై దాడి జరిగినా.. రెండు దేశాలపై జరిగినట్లే భావిస్తాం’ అని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఈ ఒప్పందం గురించి వివరించింది.
భారత్‌కు సమస్యా?
అయితే భారత్‌కు ఈ ఒప్పందం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్.. మరోసారి భారత్‌ను టార్గెట్ చెయ్యకమానదు. అలాంటి సమయంలో భారత్ కూడా గట్టిగానే బదులిస్తుంది. అప్పుడు సౌదీ ఈ గొడవలో జోక్యం చేసుకొని పాక్‌కు మద్దతిస్తే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే పైకి చెప్పకపోయినా ఇది కేవలం ఇజ్రాయెల్‌ను దృష్టిలో పెట్టుకొని చేసుకున్న ఒప్పందమేనని చాలామంది నిపుణులు చెప్తున్నారు. తాజాగా దోహాలో ఉన్న హమాస్ నేతలను ఇజ్రాయెల్ హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూక్లియర్ శక్తి ఉన్న ఇజ్రాయెల్.. ఇస్లామిక్ దేశాల్లో టెన్షన్ పెంచింది. ఇలాంటి దేశాన్ని ఎదుర్కోవాలంటే మరో న్యూక్లియర్ పవర్ సపోర్ట్ అవసరం. కానీ ఇస్లామిక్ దేశాల్లో ఒక్క పాక్ వద్ద మాత్రమే ఆటంబాంబులున్నాయి. అందుకే పాక్‌తో సౌదీ ఈ ఒప్పందం చేసుకుందని, ఒకవేళ భారత్-పాక్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొన్నా సౌదీ ఆ సమస్యలో జోక్యం చేసుకోకపోవచ్చని అంటున్నారు.
భారత్‌తో బంధాలను సౌదీ చెడగొట్టుకుంటుందా?
ఎందుకంటే భారత్- సౌదీ అరేబియా సంబంధాలు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యాయి. భారత్ నుంచి భారీగా దిగుమతులు చేసుకునే నాలుగో దేశం సౌదీ కాగా.. ఆ దేశం నుంచి అధికంగా దిగుమతులు చేసుకునే రెండో దేశం భారత్. ఇలా వాణిజ్యంతోపాటు దౌత్యపరంగా కూడా ఈ రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. కాబట్టి పాకిస్తాన్ కోసం భారత్‌తో బంధాలను చెడగొట్టుకునే సాహసం సౌదీ చెయ్యబోదని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్‌తో దాదాపు ఇస్లామిక్ దేశాలన్నింటికీ శత్రువం ఉన్న నేపథ్యంలో పాక్ అణుబాంబులతో ఇజ్రాయెల్‌ను బెదిరించేందుకే సౌదీ ఈ ఒప్పందం చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






