- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పరువునష్టం కేసులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పరువునష్టం కేసులో భారీ ఊరట లభించింది. వినాయక్ దామోదర్ సావర్కర్ (V D Savarkar)ను ఉద్దేశించి రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన కేసులో మహారాష్ట్ర నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022లో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా హిందూత్వ సిద్ధాంత కర్త, స్వాతంత్ర్య సమరయోధుడైన వీడీ సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా దాఖలైంది.
నాసిక్ నివాసి దేవేంద్ర భూటాడ తన న్యాయవాది మనోజ్ పింగిలే ద్వారా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 500 (పరువు నష్టం), 504 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద క్రిమినల్, పరువు నష్టం కేసును దాఖలు చేశారు. దీనిపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. రూ.15వేల బాండ్ ఇవ్వాలని ఆదేశించినట్లు లాయర్ పింగిలే తెలిపారు.






