పొరపాటున అలా చేస్తుండేదాన్ని.. సారా టెండూల్కర్ పోస్ట్ వైరల్

by Dishafeatures2 |
పొరపాటున అలా చేస్తుండేదాన్ని.. సారా టెండూల్కర్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సారా టెండూల్కర్ పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాల పట్టి ఈమె. సారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఏదో ఒక విషయంపై నిత్యం సోషల్ మీడియాను వాడుతూ ఉంటుంది. అయితే తాజాగా సారా తన ఇన్ స్టా లో షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. '' RBCకి బదులు పొరపాటున RCB అని రాస్తుండేదాన్ని'' అంటూ నోట్ బుక్ లో రాసిన ఓ పేజీని సారా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. సారా చేసిన ఈ పోస్టుకు RCB ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. '' మీ నాన్న సచిన్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించగా.. ప్రస్తుతం మీ తమ్ముడు అర్జున్ అదే జట్టుకు ఆడుతున్నాడు. అలాంటప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) గురించి ఎందుకు రాసేదానివి'' అంటూ వారు సరదాగా కామెంట్ చేస్తున్నారు. చదువుకునేటప్పుడు రెండ్ బ్లడ్ సెల్స్ (RBC)కు బదులు RCB అని పొరపాటున రాసి ఉండొచ్చు అంటూ మరికొంతమంది ఆమెను సపోర్టు చేస్తున్నారు.


Next Story

Most Viewed