Sanchar Saathi: విపక్షాల ఆరోపణల వేళ 10 శాతం పెరిగిన సంచార్ సాథీ యాప్ డౌన్‍లోడ్స్

by Prasad Jukanti |   (  Updated:2025-12-03 07:09:19  IST  )

సంచార్ సాథీ యాప్ డౌన్ లోడ్స్ భారీగా పెరిగాయి.

Sanchar Saathi: విపక్షాల ఆరోపణల వేళ 10 శాతం పెరిగిన సంచార్ సాథీ యాప్  డౌన్‍లోడ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం ఇకపై కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‍ను (Sanchar Saathi app) ముందుగానే ఇన్‍స్టాల్ చేసి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ప్రజల వ్యక్తిగత గోప్యతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడేనని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న వేళ ఈ యాప్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పౌరుల వ్యక్తిగత వ్యవహారాలపై నిఘా వేసేందుకే కేంద్రం సంచార్ సాథీ పేరుతో స్నూపింగ్ యాప్‍ను ప్రయోగించాలను చూస్తోందని ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ మరో‍వైపు ఈ యాప్ డౌన్ లోడ్స్ (Sanchar Saathi downloads) భారీగా పెరిగినట్లు టెలికాం విభాగం డీవోటీ (DoT) వెల్లడించింది.

మంగళవారం ఈ యాప్ డౌన్ లోడ్స్ ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలిపింది. నిన్న ఒకే రోజు డౌన్‍లోడ్ లు సగటున రోజుకు 60 వేల నుంచి 10 రెట్లు పెరిగి దాదాపు 6 లక్షలకు చేరుకున్నాయని డీఓటీ వర్గాలు చెప్పారు. అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయడానికి ముందే 1.5 కోట్ల మంది ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. తాజా వివాదం వేళ మరింత పెరిగినట్లు సంబంధింత అధికారులు వెల్లడించారు.

సాంచార్ సాథీ యాప్ పై వివాదం చెలరేగిన వేళ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.ఈ యాప్ ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులకే ఉంటుందని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న స్పష్టం చేశారు. ఎవరైనా రిజిస్టర్ అయితేనే ఈ యాప్ పని చేస్తుంది అప్పటి వరకు ఈ యాప్ మొబైల్ ఫోన్‍లలో ఇన్ స్టాల్ చేయబడి ఉన్నా అది స్లీపింగ్ మోడ్ లోనే ఉంటుందని తెలిపారు.

Next Story