- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samosa: సమోసా, జిలేబీలపై వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం క్లారిటీ
సమోసా, జిలేబీ, లడ్డూ వంటి ఆహార ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్స్ ఇచ్చేందుకు ఎటువంటి ఆదేశాలు లేవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: సమోసా, జిలేబీ, లడ్డూ వంటి ఆహార ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్స్ ఇచ్చేందుకు ఎటువంటి ఆదేశాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) స్పష్టం చేసింది. ఈ తరహా పదార్థాల్లో ఉన్న కొవ్వు, చక్కెర స్థితి, వివిధ హానికరమైన వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మాత్రమే క్యాంటీన్లు, హోటళ్ల వద్ద బోర్డులను ఏర్పాటు చేయాలనే సలహా మాత్రమే ఇచ్చామని తెలిపింది. వాటిపై హెచ్చరిక లేబుల్స్ ఉన్నట్టు మీడియాలో వెలువడిన కథనాలు తప్పదారి పట్టించేవి, నిరాధారమైనవని తోసి పుచ్చింది. అటువంటి ఉత్తర్వులు తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఏ ఆహార పదార్థంపైనా హెచ్చరిక లేబుల్‌లను ఉంచబోమని తెలిపింది. ప్రజలు నూనె లేదా తీపి స్నాక్స్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సలహా జారీ చేశామని పేర్కొంది. కాగా, సిగరేట్ల మాదిరిగా సమోసా, జిలేబీలపైనా హెచ్చరిక సందేశాలు ఇవ్వనున్నారని పలు కథనాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం క్లారిటీ ఇచ్చింది.






