పోలీస్ కస్టడీకి సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు

by Ajay Maddhiboyina |

బంగ్లాదేశ్‌లోని ఝలోకతి ప్రాంతం నుంచి ఐదు నెలల కిందట ముంబైకి వచ్చి.. చిన్నా చితకా పనులు చేసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.

పోలీస్ కస్టడీకి సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు నిందితుడు
X

- ఈ నెల 24 వరకు అనుమతించిన కోర్టు

దిశ, నేషనల్ బ్యూరో:

సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి, ఆయనపై కత్తితో దాడి చేసిన నిందితుడిని పోలీస్ స్టడీకి అప్పగించారు. థానేలోని ఒక ప్రాంతం నుంచి అనుమానితుడి అరెస్టు చేసిన పోలీసులు.. ఆదివారం బాంద్రా హాలీడే కోర్టులో హాజరుపరిచారు. ముంబై పోలీసుల అభ్యర్థన మేరకు ఈ నెల 24 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. థానే జిల్లా హిరానందాని ఎస్టేట్ సమీపంలో ఆదివారం ఉదయం నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తిని మహమ్మద్ షరీఫుల్ ఇస్తామ్ షెహ్‌జాద్‌గా గుర్తించారు. అతను బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ఝలోకతి ప్రాంతం నుంచి ఐదు నెలల కిందట ముంబైకి వచ్చి.. చిన్నా చితకా పనులు చేసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.

Next Story