- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News: వేదికపైకి వచ్చి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన రష్యా తొలి హ్యూమనాయిడ్ రోబో
రష్యా తయారు చేసిన తొలి హ్యూమనాయిడ్ రోబో వేదికపైనే కుప్పకూలి నిర్వాహకులను షాక్‌కు గురి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా తయారు చేసిన తొలి హ్యూమనాయిడ్ రోబో వేదికపైనే కుప్పకూలి నిర్వాహకులను షాక్‌కు గురి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపొందించిన ఈ రోబోకు ‘AIDOL’ (ఐడాల్) అని పేరు పెట్టారు. మాస్కోలో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో ఈ రోబోను ఘనంగా ఆవిష్కరించారు. ప్రేక్షకుల చప్పట్ల మధ్య వేదికపైకి అడుగుపెట్టిన ఐడాల్ సంగీతానికి అనుగుణంగా చేతులు ఊపుతూ నడిచింది. అయితే, కొద్ది సెకన్లకే ఆకస్మాత్తుగా స్టేజ్‌పైనే కుప్పకూలిపోయింది. అక్కడి నిర్వాహకులు వెంటనే తెరను కప్పేసి, రోబోను వెనుకకు తీసుకెళ్లారు.
ఈ ఘటనతో అరంగ్రేట్రం కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారు. రష్యన్ రోబోటిక్స్ కంపెనీ IDOL Robotics రూపొందించిన ఈ రోబో దేశంలోని AI, హ్యూమనాయిడ్ టెక్నాలజీ రంగాల్లో కొత్త దిశను చూపించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. అయితే, ఆవిష్కరణ రోజే ఇలా కూలిపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రోబో వేదికపైకి అడుగుపెట్టి కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్యా తొలి హ్యూమనాయిడ్ రోబో ప్లాప్ అంటూ పలువురు నెటిజన్‌లు విమర్శలు గుప్పించారు. వీడియో ఇదే..






