- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: చమురు సరఫరాలో ఎలాంటి సమస్య లేదు.. అమెరికా ఆంక్షలపై భారత్ స్పందన
రష్యా చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. రష్యా సరఫరాలపై ద్వితీయ ఆంక్షలు విధించినా, ప్రత్యామ్నాయ వనరుల నుంచి భారత్ తన అవసరాలుు తీర్చుకోగలదని తెలిపారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ తన వనరులను గణనీయంగా మెరుగు పర్చిందని, గతంలో 27 దేశాల నుండి చమురు కొనుగోలు చేయగా, దానిని ప్రస్తుతం 40 దేశాలకు విస్తరించిదన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు అందుబాటులో ఉన్నందున ధరలు మరింత తగ్గే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. బ్రెజిల్, గయానా, కెనడా దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లోకి చమురు వస్తుందని తెలిపారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా నుంచి చమురు అత్యధికంగా కొనుగోలు చేస్తోంది.
ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే లక్ష్యం
రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించడంపై నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన హెచ్చరికలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మార్కెట్అంశాలు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డామన్నారు. ఈ అంశంపై ధ్వంద ప్రమాణాలు ఉండొద్దని తెలిపారు. నాటో చీఫ్ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనసాగిస్తే చైనా, బ్రెజిల్, రష్యాలపై 100 శాతం ఆంక్షలు విధిస్తామని నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.






