- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడి.. 17 మంది ఖైదీలు మృతి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడులకు పాల్పడింది. జపోర్జియా ప్రాంతంలోని ఓ జైలుపై తాజాగా వైమాణిక దాడులు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా (Russia) మరోసారి భారీ దాడులకు పాల్పడింది. జపోర్జియా ప్రాంతంలోని ఓ జైలుపై తాజాగా వైమాణిక దాడులు చేసింది. ఈ ఘటనలో 17 మంది ఖైదీలు మరణించగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. రష్యా రెండు ఎస్కందర్-ఎం బాలిస్టిక్ క్షిపణులు, 37 షాహెద్- స్ట్రైక్ డ్రోన్లు, డెకాయ్ డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 32 షాహెద్ డ్రోన్లను నాశనం చేశామని పేర్కొంది. బిలెన్‌కివ్స్కా కరెక్షనల్ ఫెసిలిటీపై దాడితో జైలు డైనింగ్ హాల్ పూర్తిగా ధ్వంసం కాగా ఇతర భవనాలకు నష్టం కలిగిందని తెలిపింది. ఉక్రెయిన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. పౌర నిర్మాణాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరమని అభివర్ణించింది. కాగా, 10, 12 రోజుల్లో యుద్ధం ఆపాలని ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా విరుచుకుపడటం గమనార్హం.






