- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడి.. 500 డ్రోన్లతో అటాక్
మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఉధృతం అవుతోంది. రష్యా మరోసారి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం రోజు రోజుకూ ఉధృతం అవుతోంది. ఇటీవలే కీవ్‌లోని రైల్వే స్టేషన్ పై దాడికి పాల్పడిన రష్యా మరోసారి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ల్వివ్, జపోర్జియా, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, ఖేర్సన్, ఒడేసా, కిరోవోహ్రాడ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాలిస్టిక్ క్షిపణులు, 500 డ్రోన్లను ప్రయోగించింది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తీవ్రంగా ఖండించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ లు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రక్షణ ఒప్పందాలను వేగంగా అమలు చేయాలని తెలిపారు.






