Russia: ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడి.. 10 గంటల పాటు డ్రోన్లతో విధ్వంసం

by B.Srinivas |

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ లక్ష్యంగా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో అటాక్ చేసింది.

Russia: ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడి.. 10 గంటల పాటు డ్రోన్లతో విధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ లక్ష్యంగా 728 డ్రోన్లు,13 క్షిపణులతో అటాక్ చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.10 గంటల పాటు దాడులు కొనసాగాయని కీవ్ ప్రాంత సైనిక పరిపాలన అధిపతి మైకోలా కలాష్నిక్ తెలిపారు. ఉక్రెయిన్ దాడుల వల్ల అనేక మంది సెంట్రల్ మెటో స్టేషన్లలో తలదాచుకున్నారని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగించే వైమానిక స్థావరాలకు నిలయంగా ఉన్న లుట్స్క్ నగరం తీవ్రంగా దెబ్బతిన్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తెలిపారు.

కీవ్‌లో నివాస భవనాలు, వాహనాలు, గిడ్డంగులు, కార్యాలయాలు సహా ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్టు ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదేనని తెలిపారు. అయితే తాజా దాడులపై రష్యా స్పందించలేదు. కాగా, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ రష్యా దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story