Russia: రష్యాలో పర్యటించాలని మోడీకి ఆహ్వానం

by Shamantha N |

రష్యా(Russia) లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే (Victory Day) పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోడీకి రష్యా ఆహ్వానం పంపింది.

Russia: రష్యాలో పర్యటించాలని మోడీకి ఆహ్వానం
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా(Russia) లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే (Victory Day) పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోడీకి రష్యా ఆహ్వానం పంపింది. ఈవిషయాన్ని దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ ర్యూడెంకో (Andrey Rudenko) వెల్లడించారు. “ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఆహ్వానం పంపాం. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి” అని ఆండ్రీ వెల్లడించినట్లు రష్యన్‌ వార్తా సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తమ మిత్ర దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు పేర్కొంది. కాగా.. జనవరి 1945లో రెండో ప్రపంచయుద్ధం సమయంలో సోవియట్ సైన్యం జర్మనీపై దాడిని ప్రారంభించింది. జర్మనీ కమాండర్-ఇన్-చీఫ్ మే 9న బేషరతుగా లొంగిపోయే చట్టంపై సంతకం చేశారు. కాగా..నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ‘విక్టరీ డే’(మే 9న)ని రష్యా నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.

గతేడాది రష్యాలో పర్యటించిన మోడీ

ఇక ప్రధాని మోడీ గతేడాది జులైలో రష్యాలో పర్యటించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశ పర్యటన చేపట్టారు. ఉక్రయిన్ తో యుద్ధాన్ని ముగించాలని కోరడంతో.. ఆ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు, 2019లో వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు మోడీ హాజరయ్యారు. కాగా.. పర్యటన సందర్భంగా భారత్‌లో పర్యటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin)ను మోడీ ఆహ్వానించారు. మోడీ ఆహ్వానాన్ని పుతిన్‌ అంగీకరించినప్పటికీ.. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

Next Story