- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిక్స్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన రష్యా
బ్రిక్స్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లను రష్యా తప్పుబట్టింది. అమెరికా వ్యతిరేక విధానాలను అమలుచేసే బ్రిక్స్ దేశాలపై 10 శాతం టారిఫ్ వేస్తానన్న ట్రంప్.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, వీటిని కొనసాగించే దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సరిగ్గా బ్రిక్స్ సమావేశం జరిగే సమయంలో వచ్చిన ఈ వార్నింగులను రష్యా కూడా తప్పుబట్టింది. ప్రపంచాన్ని ఒకేలా చూసే కొన్ని దేశాలు కలిసి, ఆయా దేశాల ప్రయోజనాల కోసం సహకరించుకునే ప్రత్యేకమైన గ్రూప్ బ్రిక్స్ అని రష్యా ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ వివరించారు.
ఈ సహకారం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, ఎప్పటికీ వేరే దేశాలకు వ్యతిరేకంగా బ్రిక్స్ పనిచేయదని చెప్పారు. అయితే బ్రిక్స్ దేశాలు కొన్ని ‘అమెరికా వ్యతిరేక’ విధానాలను తీసుకొస్తున్నాయని, వీటిని అమలుచేసే దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో ఏ దేశానికీ మినహాయింపు ఉండదంటూ తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.






