Amnesty Banned : 'ఆమ్నెస్టీ' పై రష్యా నిషేధం విధించింది

by Muthe.Rajitha |

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ(International Human Rights Organization) 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌'(Amnesty International)పై రష్యా(Russia) ప్రభుత్వం నిషేధం ప్రకటించింది.

Amnesty Banned : ఆమ్నెస్టీ పై రష్యా నిషేధం విధించింది
X

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ(International Human Rights Organization) 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌'(Amnesty International)పై రష్యా(Russia) ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. ఆమ్నెస్టీని "నిషేధిత సంస్థ" (Banned Organization)గా ప్రకటిస్తూ.. దాని కార్యకలాపాలను రష్యాలో బ్యాన్ చేసింది. ఇకపై ఎవరైనా తమ దేశంలో ఆ సంస్థతో సంబంధం కలిగి ఉంటే తీవ్రవాద చర్యలకు సమానమైన శిక్షలను ఎదుర్కుంటారని జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ఆమ్నెస్టీ లండన్ కార్యాలయం రష్యా వ్యతిరేక కార్యకలాపాల శిక్షణా కేంద్రంగా పనిచేస్తూ, ఉక్రెయిన్ కీవ్ రెజిమ్ మద్దతుదారుల నుంచి నిధులు సేకరిస్తోందని రష్యా ప్రధాన ఆరోపణ. 1961లో స్థాపితమై, మానవ హక్కుల రక్షణ కోసం పనిచేసే ఆమ్నెస్టీ.. రష్యాలో రాజకీయ ఖైదీలు, వాక్ స్వాతంత్ర్య ఆంక్షలు, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా యుద్ధ నేరాలపై నివేదికలు విడుదల చేసింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా ఆమ్నెస్టీపై కఠిన చర్యలకు దిగింది. ఈ నిషేధం రష్యాలో మానవ హక్కుల కార్యకర్తలు, స్వతంత్ర మీడియాపై గొంతు నొక్కడమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, గోలోస్ వంటి సంస్థలను కూడా నిషేధించిన రష్యా, "విదేశీ గూఢచర్యం", "నిషేధిత సంస్థల" చట్టాల ద్వారా ఆ దేశంలోని ప్రభుత్వ విమర్శకులను అణచివేస్తోంది. అయితే రష్యా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమ్నెస్టీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Next Story