భారత్ బంద్ ఎఫెక్ట్.. హెల్మెట్లు పెట్టుకుని విధుల్లోకి ఆర్టీసీ డ్రైవర్లు

by Naga Rani Yarlagadda |

నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ.. కార్మిక, రైతు సంఘాలు నేడు భారత్ బంద్ (Bharat Bandh)కు పిలుపునిచ్చాయి.

భారత్ బంద్ ఎఫెక్ట్.. హెల్మెట్లు పెట్టుకుని విధుల్లోకి ఆర్టీసీ డ్రైవర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ.. కార్మిక, రైతు సంఘాలు నేడు భారత్ బంద్ (Bharat Bandh)కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలకు చెందిన సుమారు 25 కోట్లమంది కార్మికులు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో కొన్ని రాష్ట్రాల్లో బస్ డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకుని విధుల్లోకి వచ్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు డ్రైవర్ హెల్మెట్ ను ధరించి బస్సును డ్రైవ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు.. కేరళ రవాణా మంత్రి కెబి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. యూనియన్ల నుంచి అధికారిక సమ్మె నోటీసు అందకపోవడంతో కేఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు.

పశ్చిమబెంగాల్ లో బంద్ ప్రభావం అధికంగా ఉండటంతో.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కొందరు బస్సుల్ని అడ్డుకోవాలని చూడగా.. పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకుని విధుల్లోకి వచ్చారు. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించి, పట్టాలపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని సైతం పోలీసులు అడ్డుకున్నారు.

Next Story